జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్ధంతి సందర్భంగా గాంధీజీని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గాంధీజీ మార్గం సదా ఆచరణీయం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నైనా సత్యాగ్రహ దీక్షతో సాధించొచ్చు అని గాంధీజీ నిరూపించారు. గాంధీజీ సందేశం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు సీఎం కేసీఆర్.
గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపుఘాట్‌లో సర్వమత ప్రార్థనలు చేశారు.