కరోనాని తరమి కొట్టేందుకు ప్రభుత్వంతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా నడుంకట్టిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా తరచు జాగ్రత్తలు తెలియజేస్తూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఈ ఆరు విలువైన నియమాలని తప్పక పాటించాలని కోరారు.
మొదటిది, అతి ముఖ్యమైనది ఇంట్లోనే ఉండండి. ఏదో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. రెండు ఏదైనా తాకితే కనీసం 20/30 సెకన్లు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలని గుర్తుంచుకోండి. మూడవది.. మీ ముఖాన్ని, ముఖ్యంగా కళ్ళు, నోరు మరియు ముక్కును తాకకుండా ఉండండి. మీ నోటిని, ముఖాన్ని, ముక్కుని తాకవద్దు. నాలుగవది.. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు లేదా టిష్యూ వాడండి. ఐదవది .. సామాజిక దూరం యొక్క అవసరాన్ని అర్థం చేసుకుని, మీ ఇంటి లోపల లేదా బయట ఇతర వ్యక్తుల నుండి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి. ఆరవది.. మీకు కరోనా లక్షణాలు లేదా అనారోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్క్'ని వాడండి. మీకు కోవిడ్ 19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని లేదా క్లినిక్‌ని సంప్రదించండి . సరైన వనరుల నుండి మంచి సమాచారం మరియు నమ్మకమైన సమాచారాన్ని కలిగి ఉండండి. ప్రార్ధిద్దాం, మంచిని ఆశిద్దాం మరియు కలసికట్టుగా ఈ యుద్దాన్ని గెలుద్దాం అని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.